- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెట్టుబడులను ఒడిసిపట్టాలి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు అధికంగా చైనా నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటాయి. ఇండియా కూడా ఎక్కువగా చైనా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో చైనా నుంచి ఉత్పత్తులు లేకపోవడంతో కొన్ని వస్తువుల సరఫరాకు జాప్యం ఏర్పడింది. ఈ పరిణామాలతో భవిష్యత్తులో చైనాపై ఆధారపడటం తగ్గించాలని పెట్టుబడిదారులు, పలు కంపెనీలు మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలోనే మోదీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఇందులో భాగంగా చైనా నుంచి వచ్చే కంపెనీలకు అనువైన భూమిని సిద్ధం చేయడమే కాకుండా, రాష్ట్రాలు కూడా సొంతంగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచిస్తోంది.
భూములు ఉంటే వచ్చేస్తారు..
చైనా నుండి బయటికి వచ్చే కంపెనీలను ఆకర్షించడానికి ఇండియా ల్యాండ్ పూలింగ్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనికోసం దేశవ్యాప్తంగా 4,61,589 హెక్టార్ల విస్తీర్ణం గుర్తించినట్టు సమాచారం. అధికారికంగా దీని గురించి ఎవరూ ఖచ్చితమైన వివరాలు ఇవ్వలేదు. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 115,131 హెక్టార్ల పారిశ్రామిక భూములు ఉన్నట్టు గుర్తించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న సంస్థలకు భూములు లేకపోవడం అతిపెద్ద అడ్డంకిగా ఉంది. అందుకే భూములను సేకరించడానికి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఏ ఏ రంగాలంటే…
విద్యుత్తు, నీరు, రహదారి సదుపాయంతో భూమిని ఇవ్వడం వల్ల వైరస్ వ్యాప్తికి ముందే మందగించిన ఆర్థిక వ్యవస్థకు కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎలక్ట్రికల్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్, హెవీ ఇంజనీరింగ్, సౌర పరికరాలు, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, టెక్స్‌టైల్స్ లాంటి 10 రంగాలను ప్రభుత్వం ఎన్నుకుంది. పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలను గుర్తించాలని విదేశాలలో ఉన్న రాయబార కార్యాలయాలను కేంద్రం కోరింది. ప్రభుత్వ పెట్టుబడి సంస్థ అయిన ఇన్వెస్ట్ ఇండియా, ప్రధానంగా జపాన్, యుఎస్, దక్షిణ కొరియా, చైనా నుండి సమాచారాన్ని అందుకుంది. ఆయా దేశాల్లోని కంపెనీలు ఇండియాలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
లక్షల్లో ఉపాధి అవకాశాలు..
ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఇండియాతో వాణిజ్య సంబంధాలు కలిగిన తొలి 4 దేశాల్లో జపాన్, అమెరికా, సౌత్ కొరియా, చైనా ఉన్నాయి. ఈ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 179.27 బిలియన్ డాలర్లు. 2000,ఏప్రిల్ నుంచి 2019,డిసెంబర్ మధ్య ఈ దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 68 బిలియన్ డాలర్లకు పైగా వచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. చైనాపై ఆధారపడకుండా కంపెనీలను ఆకర్షించడం ద్వారా లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునే ఆస్కారం ఏర్పడుతుంది.
చర్చలు..
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన ప్రణాళిక ఈ నెలాఖరు నాటికి సిద్ధమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఫాస్ట్ ట్రాక్ వ్యూహాలపై చర్చించడానికి ఏప్రిల్ 30న ప్రధాని మోదీ సమావేశం జరిపారు. పలు రాష్ట్రాలతో కంపెనీలు చర్చలు జరుపుతున్నట్టు.. ఈ క్రమంలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో జపాన్, సౌత్ కొరియా, అమెరికా కంపెనీలు చర్చలు జరుపుతోన్న సంగతి తెలిసిందే.
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో…
ఉత్తరప్రదేశ్‌లో రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దృష్టి సారిస్తూనే..పెట్టుబడులపై చర్చలు జరుపుతోంది. వాణిజ్య, పారిశ్రామిక ప్రయోజనాల కోసం స్థలాన్ని కేటాయించడానికి ఆన్‌లైన్ వ్యవస్థను ఇప్పటికే అభివృద్ధి చేస్తోంది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి అంతర్జాతీయ సంస్థలతో చర్చలు కూడా నిర్వహిస్తోంది.
క్లియరెన్స్ సిద్ధం…
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా పెట్టుబడులకు అవకాశముంది. ఏపీకి తీరప్రాంతం ఉండటం, పైగా రెడీమేడ్ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నట్టు ఏపీ రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవా చెప్తున్నారు. అవసరమైన క్లియరెన్స్‌లతో సిద్ధంగా ఉన్నట్టు రజత్ స్పష్టం చేశారు. ముఖ్యంగా, ఐటీ రంగం, సంబంధిత మానుఫాక్చరింగ్, కెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై దృష్టి సారించినట్టు, అంతేకాకుండా పెట్టుబడిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
Tags: china, India, Narendra Modi, Andhra pradesh, coronavirus, investment companies