- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింట్లోనూ విఫలమైన భారత్‌ను పాకిస్థాన్ గట్టి దెబ్బకొట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఇండియాపై సంచలన విజయాన్ని సాధించి చారిత్రక విజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఏకంగా వారంరోజుల నుంచే ఫ్యాన్స్ అందరూ గల్లీల్లో ప్రొజెక్టర్లు పెట్టడాలు, బార్లలో అయితే స్పెషల్ స్క్రీన్‌లు పెట్టడం వంటి ఏర్పాట్లు జరిగాయి.
దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ చరిత్ర సృస్టించింది. గతంలో ఉన్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే, భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 167 మిలియన్ల (16.70 కోట్లు) మంది వీక్షించారు. దీంతో ఇప్పటి వరకు అత్యధిక మంది వీక్షించిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌గా రికార్డు సాధించింది. ఈ విషయాన్ని ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు, టీ20 ప్రపంచకప్ 2016లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ అత్యధిక మంది వీక్షించిన టీ20 మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను 136 మిలియన్ల మంది వీక్షించారు.
కాగా, టీ20 వరల్డ్‌కప్-2021 మెగా టోర్నీలో ఆడిన మొదటి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాలు చవిచూసిన భారత జట్టు, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో తమ ప్రతాపం చూపించింది. అప్పటికే సెమీస్‌కు చేరే అవకాశం కోల్పోయిన టీమిండియా చివరగా నమీబియాతో గెలిచి ఇంటిబాట పట్టింది.