అప్పడు చైనా..ఇప్పడు ఇండియా

by Shamantha N |
అప్పడు చైనా..ఇప్పడు ఇండియా
X

ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించే సోషల్ మీడియా(ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్) రూపకర్తలు అమెరికాకు చెందినవారే. ప్రస్తుత పోటి ప్రపంచంలో శత్రుదేశాల నుంచి హ్యాకింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో అభివృద్ధి చెందిన దేశాలు హ్యాకర్స్ నుంచి తమ దేశాన్నిరక్షించుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాయి. అమెరికాతో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని చైనా సొంతంగా సోషల్ మీడియాను రూపొందించుకుంది. ప్రస్తుతం ఆ దేశ పౌరులు చైనా తయారు చేసిన సామాజిక మాద్యమాలనే వాడుతున్నారు. ఇప్పడు అదే కోవలోకి భారత్ వచ్చి చేరింది. ఇండియాకు సొంతగా సోషల్ మీడియా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయినట్టు సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగంలో భారత్ వాటా 40శాతం ఉంటుందని అంచనా. అంటే మన దేశ సంపద ఇతర దేశాలకు తరలుతోంది. భారత పౌరుల వ్యక్తిగత సమాచారం అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలా అయితే అగ్రరాజ్యంతో విభేదాలు వస్తే భారత్ ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చేపట్టిన దేశీయ యాప్‌ల రూపకల్పన తుది దశకు చేరుకుందని జాతీయ భద్రతా నిపుణుడు అమిత్ దుబే తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.

Tags: draft bill presented in budget session, china, america

Advertisement

Next Story

Most Viewed