- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిప్టోకరెన్సీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్:
భౌతికంగా ఎలాంటి విలువ లేని క్రిప్టోకరెన్సీ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్చువల్ కరెన్సీ వాడకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని భారత అత్యున్నత కోర్టు తప్పుబడుతూ బుధవారం నాడు తీర్పునిచ్చింది. ఇలా కంప్యూటర్ నగదు చెల్లింపులపై నిషేధం విధించడం పారదర్శకం చూపించడమేనని హితవు పలికింది.
ఈ తీర్పుతో భారత్‌లో క్రిప్టోకరెన్సీ వాడకానికి మార్గం సుగమమైంది. బిట్ కాయిన్ లాంటి కరెన్సీలపై ఎలాంటి భారతదేశ ముద్రలు వేయడం సాధ్యం కాదు కాబట్టి వాడకం అనుమతించకూడదనే ఆర్బీఐ వాదనను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. 2018లో ఆర్బీఐ ప్రకటన తర్వాత చాలా స్టార్టప్ కంపెనీలు నిర్వీర్యంగా మారిపోయాయి. కానీ జస్టిస్ రోహింటన్ నారీమన్ బెంచ్ తీర్పుతో మళ్లీ కొత్త ఉత్తేజం పుంజుకున్నాయి. ఆర్బీఐ క్రిప్టో కరెన్సీ నిషేధానికి వ్యతిరేకంగా, ఇంటర్నెట్ ట్రేడ్ బాడీ, మొబైల్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాలు కేసు వేశాయి. ఈ తీర్పుతో భారత బ్లాక్ చెయిన్ రంగంలో విప్లవం రాబోతోందని టెక్ ఇన్వెస్టర్ నితిన్ శర్మ అన్నారు.
tags : Blockchain, Technology, Virtual Currency, Cryptocurrency, RBI, Supreme Court