- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా లెజెండ్స్ అదరగొట్టారు.. విజేతగా నిలిచారు
దిశ, స్పోర్ట్స్ : వాళ్లందరూ రిటైర్ అయిన క్రికెటర్లే.. అయినా క్రికెట్‌లోని అసలు సిసలు మజాను అందించడంలో ప్రస్తుత క్రికెటర్లకు ఏమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి తొలి సారిగా నిర్వహించిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆసక్తికరంగా సాగింది. ఆదివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ విజయం సాధించి తొలి ట్రోఫీని ముద్దాడింది.
అన్‌అకాడమీ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగింది. ఇండియా లెజెండ్స్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక లెజెండ్స్ విఫలమైంది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక లెజెండ్స్‌కు ఓపెనర్లు తిలకరత్నె దిల్షాన్, సనత్ జయసూర్య శుభారంభాన్ని అందించారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ స్కోర్ ఛేదించడానికి ఎలా ఆడాలో ఓపెనర్లు ఇద్దరూ అలా దూకుడు ప్రదర్శించారు. జయసూర్య, దిల్షాన్ కలసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే యూసుఫ్ పఠాన్ వేసిన 7.2 బంతికి దిల్షాన్ (21) కీపర్ ఓజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన చమర సిల్వ (2) ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో బద్రినాథ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో శ్రీలంక లెజెండ్స్‌పై ఒత్తిడి పెరిగింది.
సనత్ జయసూర్య(43) ఒత్తిడి పెరగడంతో యూసుఫ్ పఠాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఉపుల్ తరంగ (13) కాసేపు క్రీజ్‌లో ఉన్నా.. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ రమేష్ పొవార్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో శ్రీలంక లెజెండ్స్ ఇక క్యూ కడతారని అందరూ భావించారు. కానీ చింతక జయసింఘే, కౌశల్య వీరరత్నే కలసి భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. బౌండరీలు, సిక్సులు కొడుతూ లక్ష్యం దిశగా దూసుకొని వెళ్లారు. వీరిద్దరూ కలసి 5వ వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారిన వీరరత్నే (38) మన్‌ప్రీత్ గోని బౌలింగ్‌లో వినయ్‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత కొద్ది సేపటికే జయసింఘే (40) కూడా పెవిలియన్ చేరాడు. ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక 14 పరుగుల దూరంగా ఆగిపోయింది. దీంతో ఇండియా లెజెండ్స్ 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌పై గెలిచి తొలి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ చాంపియన్‌గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు యూసుఫ్ పఠాన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దిల్షాన్‌కు అందించారు.
దంచి కొట్టిన యువీ, యూసుఫ్
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (10), బద్రినాథ్ (7) విఫలమయ్యారు. అయితే మరో ఓపెనర్ సచిన్ టెండుల్కర్, యువరాజ్‌తో కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సచిన్ దూకుడుగా ఆడుతుండగా యువీ మరో ఎండ్‌లో బౌండరీలతో చెలరేగాడు. వీరిద్దరూకలసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. అయితే మహరూఫ్ బౌలింగ్‌లో సచిన్ (30) ఉపుల్ తరంగకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత యువరాజ్, యూసుఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రతీ ఓవర్లో బౌండరీ లేదా సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలసి 4వ వికెట్‌కు 85 పరుగులు జోడించారు. మరో ఎండ్‌లో ఉన్న యూసుఫ్ 5 సిక్సులు, 4 ఫోర్లతో కేవలం 36 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఒకానొక దశలో ఇండియా లెజెండ్స్ 200 పరుగులు చేస్తుందని అందరూ భావించారు. కానీ చివరి మూడు ఓవర్లను శ్రీలంక లెజెండ్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఇండియా లెజెండ్స్ 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. రంగన హెరాత్, సనత్ జయసూర్య, మహరూఫ్, వీరరత్నే తలా ఒక వికెట్ తీశారు.
ఏడాది పాటు సాగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్
రోడ్డు భద్రతపై అవగాహన కలిగించడానికి మహారాష్ట్రకు చెందిన ది రోడ్ సేఫ్టీ సెల్ ఈ సిరీస్ నిర్వహించింది. ఏడు దేశాలకు చెందిన రిటైర్డ్ క్రికెటర్లతో ఈ టోర్నీ ఏర్పాటు చేశారు. గత ఏడాది మార్చి 7న ముంబయి, పూణే వేదికలుగా టోర్నీ ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా నాలుగు మ్యాచ్‌ల తర్వాత టోర్నీ వాయిదా పడింది. వాయిదా పడిన మ్యాచ్ దగ్గర నుంచే ఈ ఏడాది మార్చి 5 నుంచి టోర్నీ కొనసాగించారు. కొవిడ్ నిబంధనల కారణంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ ఈ ఏడాది సిరీస్ ఆడలేదు. అన్ని మ్యాచ్‌లు చత్తీస్‌గడ్ లోని రాయ్‌పూర్‌లో నిర్వహించారు.
స్కోర్ బోర్డు :
ఇండియా లెజెండ్స్
వీరేంద్ర సెహ్వాగ్ (బి) రంగన హెరాత్ 10, సచిన్ టెండుల్కర్ (సి) తరంగ (బి) మహరూఫ్ 30, బద్రినాథ్ (ఎల్బీడబ్ల్యూ)(బి) జయసూర్య 7, యువరాజ్ సింగ్ (సి) మహరూఫ్ (బి) వీరరత్నే 60, యూసుఫ్ పఠాన్ 62 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 8 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లు) 181/4
వికెట్ల పతనం : 1-19, 2-35, 3-78, 4-163
బౌలింగ్ : రంగన హెరాత్ (2-0-11-1), నువాన్ కులశేఖర (4-0-44-0), తిలకరత్నె దిల్షాన్ 2-0-25-0), సనత్ జయసూర్య (2-0-17-1), ధమ్మిక ప్రసాద్ (4-0-42-0), ఫర్వేజ్ మహరూఫ్ (4-0-16-1), కౌశల్య వీరరత్నే (2-0-23-1)
శ్రీలంక లెజెండ్స్
తిలకరత్నె దిల్షాన్ (సి) నమన్ ఓజా (బి) యూసుఫ్ పఠాన్ 21, సనత్ జయసూర్య (ఎల్బీడబ్ల్యూ)(బి) యూసుఫ్ పఠాన్ 43, చమర సిల్వ (సి) బద్రినాథ్ (బి) ఇర్ఫాన్ పఠాన్ 2, ఉపుల్ తరంగ (సి)(సబ్) రమేష్ పవార్ (బి) ఇర్ఫాన్ పఠాన్ 13, చింతక జయసింఘే (రనౌట్) 40, కౌశల్య వీరరత్నే (సి) వినయ్ కుమార్ (బి) మన్‌ప్రీత్ గోనీ 38, నువాన్ కులశేఖర 1 నాటౌట్, ఫర్వీజ్ మహారూఫ్ (సి) వినయ్ కుమార్ (బి) మునాఫ్ పటేల్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లు) 167/7
వికెట్ల పతనం : 1-62, 2-65, 3-83, 4-91, 5-155, 6-167, 7-167
బౌలింగ్ : మన్‌ప్రీత్ గోనీ (4-0-24-1), మునాఫ్ పటేల్ (4-0-46-1), ప్రజ్ఞాన్ ఓజా (2-0-12-0), వినయ్ కుమార్ (2-0-29-0), యూసుఫ్ పఠాన్ (4-0-26-2), ఇర్ఫాన్ పఠాన్ (4-0-29-2)