స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల వివరాలు వెల్లడి..

by Harish |
స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల వివరాలు వెల్లడి..
X

దిశ, వెబ్‌డెస్క్: సమాచారా మార్పిడి ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌లోని స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలను కేంద్రానికి అందజేసింది. మూడో విడత జాబితాను సోమవారం స్విట్జర్లాండ్ ప్ర్బహుత్వం ఇచ్చింది. అత్యంత గోప్యతను పాటించే స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్లధనం వివరాలను ‘ఆటోమెటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ ఒప్పందానికి లోబడి ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఇందులో అకౌంట్ నంబర్‌తో పాటు ఖాతాదారుడి పేరు, పన్ను గుర్తింపు సంఖ్య, డివిడెండ్, బీమా సహా పలు వివరాలను ఇస్తారు. అంతేకాకుండా చెల్లింపులు, ఆస్తుల విక్రయాలు, క్రెడిట్ బ్యాలెన్స్ లాంటి ఆదాయ వివరాలను పరస్పరం మార్చుకునేలా ఈ ఒప్పందం జరిగింది.

మొత్తం 33 లక్షల ఖాతాదారుల వివరాలను 96 దేశాలతో వివరాలను పంచుకున్నట్టు స్విట్జర్లాండ్ ప్రకటించింది. ఫెడ‌ర‌ల్ ట్యాక్స్ అడ్మిషినిస్ట్రేష‌న్ (ఎఫ్‌టీఏ) ప్రకటనలో ఈ ఏడాది అదనంగా ఘనా, లెబనాన్, మకావ్, పాకిస్తాన్, ఖతార్, ఆంటిగ్వా, బార్బుడా, అజర్ బైజాన్, డొమినికా, సమోవా, వౌటు వంటి 10 దేశాలతో సమాచార మార్పిడిని పంచుకున్నట్టు తెలిపారు. ఇక, మరో విడత సమాచార మార్పిడి 2022, సెప్టెంబర్‌లో ఉంటుందని స్విట్జర్లాండ్ పేర్కొంది. సోమవారం వచ్చిన వివరాల్లో స్విట్జర్లాండ్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో భారీగా ఉన్న భారతీయ వ్యక్తులు, కంపెనీల వివరాలను భారత అధికారులతో పంచుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story