పాక్ కాల్పులపై భారత్ ఆగ్రహం…

by Shamantha N |
పాక్ కాల్పులపై భారత్ ఆగ్రహం…
X

దిశ, వెబ్ డెస్క్:ఎల్‌వోసీ వెంబడి పాక్ బలగాల కాల్పులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్నటి కాల్పులపై పాకిస్థాన్‌కు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ హై కమిషనర్‌ను పిలిచి భారత విదేశాంగ శాఖ నిరసన తెలిపింది. దీపావళి వేళ ఉద్దేశ్య పూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని నిరసన తెలిపింది. పౌరులపై దాడి చేయడాన్ని భారత విదేశాంగ శాఖ ఖండించింది. పాక్ కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారని భారత్ తెలిపింది. 19 మంది పౌరులు గాయపడ్డారని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed