- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైడ్రాక్సీ క్లోరోక్విన్ సప్లై చేస్తాం : కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో తీవ్రంగా బాధపడుతున్న దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఎగుమతి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా విలయం చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజ సమన్వయం, సంఘీభావానికి భారత్ కట్టుబడి ఉందని మన దేశం విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఆపత్కాలంలో మానవతా దృక్పథంతో.. భారత్ పై ఆధారపడిన పొరుగు దేశాలకు నిర్దేశించుకున్న మొత్తాల్లో పారాసిటమల్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను సరఫరా చేసేందుకు నిర్ణయించిందని వివరించారు. ఈ మహమ్మారితో విలవిల్లాడుతున్న దేశాలకూ వీటిని సప్లై చేస్తామని తెలిపారు. ఈ డ్రగ్స్ ఎగుమతి విషయంలో ఎటువంటి పైరవీలు, రాజకీయాలను అనుమతించబోమని చెప్పారు. చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కొద్ది మేరకు ప్రభావం చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటి ఎగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపించాల్సిందిగా భారత్ ను కోరామని, దానికి భారత్ సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్టు సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ ఆ డ్రగ్ సరఫరా చేయకుంటే ప్రతీకార చర్యలను పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు.
Tags: Coronavirus, india, export, hydro chloroquine, trump, retaliation