కరోనాను భారత్ ఓడించగలదు

by Anukaran |
కరోనాను భారత్ ఓడించగలదు
X

జెనీవా: ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేస్తున్న ఇండియా కచ్చితంగా కరోనా మహమ్మారిని జయించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) విశ్వాసాన్ని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న దేశాలు అమెరికా, బ్రెజిల్, భారత్‌లు కరోనాను సమర్థంగా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ ప్రొగ్రామ్ హెడ్ డాక్టర్ మైక్ రేయాన్ అన్నారు. శక్తివంతమైన ఆ ప్రజాస్వామ్య దేశాలు అంతర్గతంగా అచంచల సామర్థ్యాలను కలిగి ఉన్నాయని తెలిపారు.

హెర్డ్ ఇమ్యూనిటీ లేదు: చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్
ఇప్పటికైతే ప్రపంచంలో ఏ చోటా హెర్డ్ ఇమ్యూనిటీ లేదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. కరోనా విశ్వరూపం చూపిన దేశాల్లో ప్రస్తుతం 5 నుంచి 10శాతం మందిలో (కొన్ని దేశాల్లో గరిష్టంగా 20శాతం మందిలో)యాంటీబాడీలున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయని అన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే కనీసం 50 నుంచి 60శాతం మంది కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండాలని అప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమని అభిప్రాయపడ్డారు. పలుదేశాలలో అనేక దఫాలుగా ఈ వైరస్ కమ్మేస్తున్నదని, అక్కడ వైరస్ నిరోధక శక్తిని అభివృద్ధి చేసుకున్నవారే హెర్డ్ ఇమ్యూనిటీకి దోహదపడతారని తెలిపారు. అయితే, ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్ వ్యాక్సిన్ ద్వారా అభివృద్ధి చేసుకోవడం ఉత్తమమని, ప్రజలను వైరస్‌కు వదిలిపెడితే ఇప్పటిలాగే ఎన్నోదఫాలుగా వస్తున్న వైరస్‌తో భారీగా ప్రాణనష్టాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed