‘రాబోయే దశాబ్దం భారత్‌దే’

by Harish |
‘రాబోయే దశాబ్దం భారత్‌దే’
X

దిశ, వెబ్‌డెస్క్: నైపుణ్యం, సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొనే సత్తా ఉన్న నేపథ్యంలో ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కేంద్రంగా మారే సత్తా భారత్‌కు ఉందని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. సాంకేతికతకు తగిన పాలసీ విధానాల కారణంగా అభివృద్ధి వేగవంతమంగా ఉండనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ భారత్ భవిష్యత్తును, దిశను మార్చగలదని తెలిపారు.

రైజ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. భారత్‌కు ఉన్న ప్రతిభ, సంక్లిష్టతలను పరిష్కరించే సత్తా ఉందనే భరోసాతోనే తాను ఈ వ్యాఖ్యలను చేస్తున్నానని స్పష్టం చేశారు. ఏఐను ఉపయోగించి భారత్ సమస్యలను పరిష్కరించగలిగినపుడు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు అభువృద్ధి చెందిన దేశాల సమస్యలను కూడా భారత్ పరిష్కరించే స్థాయికి చేరుకుంటుందని నమ్ముతున్నట్టు ఆయన వివరించారు.

ప్రధానంగా ఆరోగ్య సంరక్షన, విద్య వంటి సేవలను భారత్ పరిష్కరించగలిగితే రాబోయే దశాబ్దం భారత్‌దే అవుతుందని చంద్రశేఖరన్ తెలిపారు. అత్యధిక జనాభాను సంతృప్తి పరుస్తూ భవిష్యత్తు ఉత్పాదక సామర్థ్యాన్ని భర్తీ చేసే ఉద్యోగ కల్పన భారత్‌కు ఉన్న మరో అతిపెద్ద సవాలు.

Advertisement

Next Story

Most Viewed