ఆ పరిస్థితులు రికవరీకి దారితీస్తాయి

by Harish |
ఆ పరిస్థితులు రికవరీకి దారితీస్తాయి
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మకాలను ప్రభావితం చేసిన కఠిన లాక్‌డౌన్ తర్వాత భారత్ మళ్లీ వృద్ధి మార్గంలోకి తిరిగి వచ్చిందని దేశీయ అతిపెద్ద ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ హిందూస్తాన్ యూనిలీవర్ (Hindustan Unilever) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్ట్రెంబర్ త్రైమాసికంలో భారత వ్యాపార వృద్ధి 5.3 శాతంగా కంపెనీ పేర్కొంది. భారత్‌లో ఫుడ్, రీఫ్రెష్‌మెంట్, క్లీనింగ్ విభాగాల వృద్ధి నేపథ్యంలో భారత్ స్వల్పంగా సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేస్తోందని, బ్యూటీ, పర్శనల్ కేర్ విభాగాలు పూర్తి స్థాయిలో మెరుగవ్వాల్సి ఉందని కంపెనీ వెల్లడించింది.

ప్రస్తుత ఏడాది మొదటి సగంలో ఉన్న అమ్మకాలతో పోలిస్తే లాక్‌డౌన్ పరిమితులు సడలించిన తర్వాత మెరుగైన ఫలితాలను చూస్తున్నామని కంపెనీ పేర్కొంది. రెండో త్రైమాసికంతో పోలిస్తే ఫుడ్ సర్వీసెస్, ఐస్‌క్రీం ఉత్పత్తుల వ్యాపారాలు తగ్గుతూ వచ్చాయని, ఈ త్రైమాసికంలో బలమైన పనితీరును కనబరిచాం. వినియోగదారుల విభాగంలో మారుతున్న పరిస్థితులను గమనిస్తున్నామని హిందూస్తాన్ యూనిలీవర్ సీఈవో అలన్ జోప్ చెప్పారు.

ఫుడ్, రీఫ్రెష్‌మెంట్ వ్యాపారాం దాదాపు 83 శాతం పెరిగిందని, హోమ్ కేర్, పర్శనల్ కేర్ విభాగాలు దాదాపు కరోనాకు ముందునాటి స్థాయికి దగ్గరగా ఉన్నాయని ఆయన వివరించారు. పలు ప్రముఖ బ్రాండు ఉత్పత్తుల కారణంగా కంపెనీ కొంత వెనకబడిందని, రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే పరిస్థితుల మధ్య రికవరీపై ఆశాజనకంగా ఉన్నామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed