- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారం హాల్‌మార్కింగ్ సమ్మెకు నై అన్న ఐబీజేఏ
దిశ, వెబ్‌డెస్క్: బంగారం హాల్ మార్కింగ్ విషయంలో దేశవ్యాప్తంగా వ్యాపారుల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. బంగారు ఆభరణాలపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బంగారం వ్యాపారులు ఒప్పుకోవట్లేదు. ఇందులో భాగంగా సోమవారం(ఆగష్టు 23న) ఒకరోజు సమ్మె నిర్వహించాలని నిర్ణయించారు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) వివరాల ప్రకారం.. రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు చెందిన సుమారు 350 సంఘాలు, సమాఖ్యలు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి.
బంగారం స్వచ్ఛతకు గుర్తింపుగా హాల్ మార్క్ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతుండగా, దీనివల్ల వ్యాపారాలపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జీజేసీ అంటోంది. అయితే, రత్నాలు, ఆభరణాల రంగంలో 102 సంవత్సరాల పురాతన సంస్థ ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) ఈ సమ్మెకు మద్దతు ఇవ్వట్లేదని ఆదివారం ప్రకటించింది. తప్పనిసరి హాల్ మార్కింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు అవసరమని భావిస్తున్నాం అన్నారు. ఈ కొత్త నిర్ణయం వల్ల నకిలీ లేదంటే నకిలీ హాల్‌మార్కింగ్ బంగారం వినియోగదారులకు చేరదు. వినియోగదారులకు అందించే సరుకు పట్ల నిబద్ధత అవసరమని నమ్ముతున్నామని’ ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అన్నారు.