డెక్సామెథాసోన్ డ్రగ్‌కు భారత్ ఆమోదం

by Shamantha N |
డెక్సామెథాసోన్ డ్రగ్‌కు భారత్ ఆమోదం
X

ఢిల్లీ: మధ్యస్థాయి లేదా తీవ్రంగా కరోనాతో బాధపడుతున్న పేషెంట్‌లకు డెక్సామోథాసోన్ మందును వినియోగించడానికి భారత ప్రభుత్వం శనివారం ఆమోదముద్ర వేసింది. మిథైల్ ప్రెడ్నిసొలోన్ మందుకు బదులుగా చౌకగా లభించే ఈ మందును పేషెంట్లకు అందించడానికి కేంద్రం అనుమతినిచ్చింది. కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న పేషెంట్ల ప్రాణాలను కాపాడుతున్నదని బ్రిటీష్ క్లినికల్ ట్రయల్స్‌లో తేలిన తర్వాత డెక్సామెథాసోన్ మందు ఉత్పత్తిని వేగంగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సంగతి తెలిసిందే. ఈ మందు 60ఏళ్లుగా మార్కెట్‌లో ఉన్నది. అర్థిరిటిస్ లాంటి వ్యాధులను నయం చేస్తున్నది. తాజాగా, కరోనాతో పోరాడేందుకు పేషెంట్లకు ఈ మందు ఉపకరిస్తున్నదని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ పరీక్షలో మెరుగైన ఫలితాలనిచ్చింది. వెంటిలేటర్ ద్వారా మాత్రమే శ్వాసించే స్థాయికి చేరుకున్న రెండు వేల మంది కరోనా పేషెంట్లకు ఈ మందు అందించగా, 35శాతం మరణాలను తగ్గించిందని పరిశోధకులు వెల్లడించారు. కాగా, ఈ మందును తీవ్ర లక్షణాలున్న కరోనా పేషెంట్లకు మాత్రమే ఇవ్వాలని, వారి చికిత్సనూ పర్యవేక్షించాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

Advertisement

Next Story

Most Viewed