మతాలు వేరైనా.. ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్ శివమ్ దూబే.. పిక్స్ వైరల్

by Shiva |   ( Updated:2021-07-17 03:40:41.0  )
Shivam-dube
X

దిశ, వెబ్‌డెస్క్ : టీం ఇండియా క్రికెటర్ శివమ్ దూబే పెళ్లి చేసుకున్నాడు. ముంబై మోడల్ అజుమ్ ఖానును ప్రేమించిన శివమ్.. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. అయితే, కరోనా నేపథ్యంలో అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు మధ్య ప్రేమికులిద్దరూ వివాహం బంధంతో ఒక్కటయ్యారు. తన వివాహానికి సంబంధించిన ఫోటోలను శివమ్ దూబే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పిక్స్ వైరల్ అయ్యాయి.

‘మేం ప్రేమ కంటే, ఎక్కువగా ప్రేమించుకున్నాం. ఇలా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది.. జస్ట్ మ్యారీడ్’ అంటూ పెళ్లి ఫోటోలను పోస్టు చేశాడు శివమ్ దూబే. అయితే, శివమ్ దూబే హిందూ యువకుడు కాగా, అజుమ్ ఖాన్ ముస్లిం యువతి కావడం విశేషం. దీంతో, వీరిద్దరూ ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ రెండు మతాల సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed