టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. కారును నిండా ముంచుతున్న రోటి మేకర్

by Sridhar Babu |   ( Updated:2021-11-01 23:21:15.0  )
RotiMaker1
X

దిశ, కరీంనగర్ సీటీ: హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యం కనబర్చారు. తొలి రౌండ్ ఫలితాలు వెలువడిన తరువాత స్వతంత్ర్య అభ్యర్థి సిలువేరు శ్రీకాంత్ కు 122 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కు 119 ఓట్లు వచ్చాయి. అయితే శ్రీకాంత్ కు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తు రోటి మేకర్ కావడం విశేషం. ఇప్పటికే ఈ గుర్తు కారును పోలి ఉందని మంత్రి హరీష్ రావు ప్రచారంలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ కు 122 ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. చివరి రౌండ్ వరకు శ్రీకాంత్ కు ఎన్ని ఓట్లు పోలవుతాయి.. కారును నిండా ముంచుతాయా అన్న చర్చ మొదలైంది. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కోట శ్యాంకుమార్ కు 113 ఓట్లు రావడం విశేషం.

నా సత్తా ఏంటో చూపిస్తా.. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed