- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుపరిపాలన అందుబాటులోకొచ్చింది: గొంగిడి సునీత
దిశ, భువనగిరి: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాకారానికి ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చి గ్రామాలాభివృద్ధికి విధివిధానాలను అమలు పరుస్తూ అభివృద్ధిలో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. 74 వస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకమైన సుపరిపాలన అందుబాటులో కొచ్చిందన్నారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాల వల్ల సాధించుచకున్న స్వాతంత్ర్య ఫలాలు ప్రతిఒక్కరికీ దక్కాలని ఆమె ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ సాధనకు ప్రతిఒక్కరూ అంకితమై కృషి చేయాలన్నారు. జిల్లా రైతానికి సాగు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో సాగు నీరంది ఈ ప్రాంత బీడు భూములు సస్యశ్యామలమవుతాయన్నారు.
ఫిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునాది గాని కాల్వల పునరుద్ధరణకు నిధులు మంజూయ్యాయని.. త్వరలో పనులు చేపడతారని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆసరా ఫించన్లు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తున్నదని, అదేవిధంగా రైతు పెట్టుబడి సాయం, రైతు భీమా అమలు చేస్తున్నదని ఆమె వివరించారు. కరోనా మహమ్మారి వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా బాధితుల కోసం ప్రభుత్వం మెరుగైన వైద్యలందిస్తుందన్నారు.
బీబీనగర్ లో ఉన్న ఎయిమ్స్ లో కరోనా వైద్య సేవలందిస్తూ కరోనాను కట్టడి చేస్తున్నజిల్లా వైద్య బృందాన్ని ఆమె అభినందించారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ చిత్ర పటానికి ఆమె నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరి షత్ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి, భువనగిరి ఎమ్యెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్మినేటి కృష్ణా రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారాంచంద్రన్, అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యానాయక్, శ్రీనివాస్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ గరీమా అగర్వాల్, డీసీపీ నారాయణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.