15 వేలు దాటిన కరోనా మరణాలు

by Sujitha Rachapalli |
15 వేలు దాటిన కరోనా మరణాలు
X

దిశ వెబ్ డెస్క్ : కరోనా మహమ్మారి ప్రపంచంపై తన కోపాన్ని చూపిస్తోంది. ఆ మహామ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ కథనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాటికి కరోనా మరణాల సంఖ్య 15 వేలు దాటింది. మొత్తం 15,189 మరణాలు సంభవించగా, ఒక్క యూరప్‌లోనే 9,197 మరణాలు నమోదు కావడం గమనార్హం. స్పెయిన్ లోనూ కరోనా తీవ్రత మరింత ఎక్కువైంది. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 1395 మంది చనిపోగా, అందులో 462 మంది స్పెయిన్ దేశస్తులే ఉన్నారు. దేశాల పరంగా చూస్తే చైనా వెలుపల అత్యధిక మరణాలు సంభవించినది ఇటలీలోనే. చైనాలో ఇప్పటి వరకు 3,270, స్పెయిన్‌లో 2,182 కేసులు నమోదయ్యాయి. ఇటలీలో మాత్రం 5,476 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో 1,72,238 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,289కి పెరిగింది. యూరప్‌ ఖండంలోనూ కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది.
Tags : CORONA, VIRUS, DEATH, COVID-19, 24 HOURS, SPAIN, ITALY, EUROPE, CHAINA,

Advertisement

Next Story