పాలేరుకు కొనసాగుతున్న వరద ఉధృతి

by Sridhar Babu |   ( Updated:2020-07-16 03:17:14.0  )
పాలేరుకు కొనసాగుతున్న వరద ఉధృతి
X

దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరు నది గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు 100-130 క్యూసెక్కులు వరద నీరు పాలేరులోకి వచ్చి చేరుతోంది. దీంతో ఏరు ఉధృతంగా ప్రవహిస్తూ దిగువకు వెళ్తుంది. కూసుమంచి మండలంలోని తుమ్మలతాండ, రాజుపేట, జేక్కేపల్లి మీదుగా నేలకొండపల్లి మండలంలోని చెన్నారం, సుద్దేపల్లి, రామచంద్రపురం, పైనంపల్లి మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి వరద నీరు ప్రవేశిస్తోంది.

Advertisement

Next Story