- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో కరోనా రికార్డు.. ఇవాళ 1933 కేసులు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఒకే రోజు రెండు వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఏపీలో గడచిన 24 గంటల్లో 1933 మందికి కరోనా సోకింది. ఇందులో ఏపీకి చెందిన వారు 1914 మంది ఉంటే.. ఒక విదేశీయుడితో పాటు 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం విశేషం. దీంతో ఏపీలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,168కి చేరుకుంది.
ఇందులో 13,428 మంది వివిధ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతుండగా, 15,412 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించగా, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు. చిత్తూరులో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 328 మంది మృత్యువాతపడ్డారు.