- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భగ్గుమంటున్న భానుడు..
దిశ, ఏపీ బ్యూరో : మార్చి ప్రారంభంలోనే భానుడు భగ్గుమంటున్నాడు. అప్పుడే వేసవి వచ్చినట్లుంటోంది. ఎన్నడూ లేని విధంగా భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ఈ ఏడాది శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదయ్యాయి. అయితే ఫిబ్రవరి మూడో వారం వరకు చలి వాతావరణం కొనసాగింది. కానీ చలి తగ్గుతున్న సమయంలో ఒక్కసారిగా ఎండలు పెరిగాయి.
తూర్పు తీరంలోని భువనేశ్వర్‌లో మూడు రోజుల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రస్తుతానికి కోస్తాంధ్రలో సాధారణ స్థాయి ఎండలు ఉంటున్నా, రాయలసీమలో అధికఉష్ణోగ్రతలునమోదవుతున్నాయి. వారం రోజులుగా సీమ ప్రాంతంలో 2-3 డిగ్రీలు ఎండ ఎక్కువగానే నమోదవుతోంది. రెండు రోజుల క్రితం భారత వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ ఏడాది దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, రాయలసీమ తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయని పేర్కొంది.
మార్చి నుంచి మే వరకు కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.22 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది. అదే రాయలసీమలో సాధారణం కంటే 0.33 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ నిపుణుడు ఆచార్య ఓఎస్ఆర్‌యూ భానుకుమార్ తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి నుంచి మే వరకు కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ తగ్గాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అటువంటిదేమీ లేనందున యథావిధిగా సీవోటీ పెరిగినట్లు తెలిపారు. దీనివల్ల వాతావరణం వేడిగా మారిందన్నారు. శివరాత్రికి ముందే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి.