ఏపీలో పెరిగిన మద్యం ధరలివే…!

by srinivas |   ( Updated:2020-05-04 01:58:12.0  )
ఏపీలో పెరిగిన మద్యం ధరలివే…!
X

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లన్నింటిలో పరిమితులతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం ఆంక్షలు అమలవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం విక్రయాలు జరుగనున్నాయి. వైన్ షాపులకు అనుబంధంగా ఉన్న బార్లు అండ్ రెస్టారెంట్లు, పర్మిట్ రూమ్‌లకు అనుమతి లేదు. కేవలం మద్యం విక్రయశాలలు (వైన్ షాప్స్) మాత్రమే తెరవాలని, అది కూడా విడిగా ఉన్న షాపులు మాత్రమే తెరవాలని స్పష్టంగా ఏపీ ఎక్సైజ్ శాఖ ఆదేశించాలిచ్చింది. ఈ మేరకు విక్రయాలు ప్రారంభమయ్యాయి.

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే సిబ్బంది మాస్కలు ధరించి విధులకు హాజరయ్యారు. బారులు తీరిన మద్యం వినియోగదారులకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యనియంత్రణ దిశగా అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం ధరలు పెంచి విక్రయిస్తోంది. పెంచిన ధరల వివరాల్లోకి వెళ్తే..

బీరు:
330 ఎంఎల్ – పెరిగిన ధర 20 రూపాయలు. 500/650 ఎంఎల్ – 30 రూపాయలు పెరిగింది.
30000 ఎంఎల్ – 2000 రూపాయలు పెరిగింది. 50000 ఎంఎల్ – 3000 రూపాయలు పెరిగింది.

రెడీ టూ డ్రింక్ (మద్యం) 250/275 ఎంఎల్ – 30 రూపాయలు పెరిగింది.

180 ఎంఎల్ ధర 120 రూపాయల కంటే తక్కువ ఉన్న వాటిపై పెరిగిన ధరల వివరాల్లోకి వెళ్తే…
60/90 ఎంఎల్ – 10 రూపాయలు పెరిగింది. 180 ఎంఎల్ – 20 రూపాయలు పెరిగింది.
375 ఎంఎల్ – 40 రూపాయలు పెరిగింది. 750 ఎంఎల్ – 80 రూపాయలు పెరిగింది.
1000 ఎంఎల్ – 120 రూపాయలు పెరిగింది. 2000 ఎంఎల్ – 240 రూపాయలు పెరిగింది.

180 ఎంఎల్ ధర 120 రూపాయల నుంచి 180 రూపాయల మధ్యలో ఉన్న వాటిపై పెరిగిన ధరల వివరాల్లోకి వెళ్తే..
60/90 ఎంఎల్ – 20 రూపాయలు పెరిగింది. 180 ఎంఎల్ – 40 రూపాయలు పెరిగింది.
375 ఎంఎల్ – 80 రూపాయలు పెరిగింది. 750 ఎంఎల్ – 160 రూపాయలు పెరిగింది.
1000 ఎంఎల్ – 240 రూపాయలు పెరిగింది. 2000 ఎంఎల్ – 480 రూపాయలు పెరిగింది.

150 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న మద్యం ధరల వివరాల్లోకి వెళ్తే..
60/90 ఎంఎల్ – 30 రూపాయలు పెరిగింది. 180 ఎంఎల్ – 60 రూపాయలు పెరిగింది.
375 ఎంఎల్ – 120 రూపాయలు పెరిగింది. 750 ఎంఎల్ – 240 రూపాయలు పెరిగింది.
1000 ఎంఎల్ – 360 రూపాయలు పెరిగింది. 2000 ఎంఎల్ – 720 రూపాయలు పెరిగింది.

Tags: ap, liquor rates, liquor price hike, wine shopes

Advertisement

Next Story