- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా మాయ.. డెలి'వర్రీ'కి మోర్ క్యాష్
దిశ ప్రతినిధి, మేడ్చల్: కాన్పు కోసం ఆస్పత్రులకు వెళ్తే కాసులు దండుకుంటున్నారు. కరోనా బూచిని చూపి రేట్లు రెట్టింపు చేశారు. అత్యవసరాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు దండుకుంటున్నారు. కరోనా చికిత్స కేంద్రాలుగా ప్రభుత్వ ఆస్పత్రులను మార్చడంతో ఇన్నాళ్లు వాటిల్లో టెస్టులు చేయించుకున్న గర్భిణులు ఇప్పుడు ప్రైవేటు దవాఖానాలకు వెళ్లాల్సి వస్తున్నది. సాధారణ డెలివరీ కోసం రూ. 50వేల వరకు.., సీజేరియన్ అయితే రూ.లక్షల్లో ప్రైవేటు ఆసుపత్రులు బిల్లులను వసూలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కొవిడ్ చికిత్స కేంద్రాలు మార్చడంతో మెటర్నిటీ వసతులు ఉన్న ఆసుపత్రులు అందినకాడికి దోచుకుంటున్నాయి. ఆస్పత్రి బిల్లులు చూస్తే బిడ్డ పుట్టిన సంబురం లేకుండా పోతున్నది బాధిత కుటుంబాలు బోరుమంటున్నాయి.
ఇన్నాళ్లు ప్రభుత్వ దవాఖానాల్లో పరీక్షలు చేయించుకున్న గర్భిణులు అన్ని ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి ఉండగా.. చేసేది లేక కరోనా గర్బిణీలకు పుట్టెడు కష్టాలు తెచ్చిపెడుతోంది. నవ మాసాలు మోసిన బిడ్డను బయట ప్రపంచానికి పరిచయం చేసేందుకు ‘ప్రసవ వేధన’ను అనుభవిస్తోంది. డెలివరీ కోసం వెళ్లితే వైద్యం అందనంత దూరంలో ఉంది.ఈ కరోనా కష్ట కాలంలో వైద్యం బాగా ఖరీదైపోయింది.
కాన్పుకు కాసుల కష్టాలు
గ్రేటర్ హైదరాబాద్ లోని సాధారణ, మధ్య తరగతి కుబుంబాల్లో గర్భిణులను కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కొవిడ్ చికిత్స కేంద్రాలుగా మార్చివేశారు. మిగతా ఆసుపత్రుల్లోనూ పరిమితికి మించి వైద్య సేవలు అందుబాటులో లేవు. దీంతో ఇంతకాలం ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యం పొందిన గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేటు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఫలితంగా వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నది. గతంలో గరిష్ఠంగా రూ.25 వేలు చెల్లిస్తే సాధారణ కాన్పు పూర్తి అయ్యేంది. కానీ ఇప్పుడా రేట్లను డబుల్ చేశారు. కరోనా బూచిని చూపి వైద్యులు రోగులను పిండేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ డెలివరీ కోసం రూ.50వేలు, అత్యవసరమై సిజేరియన్ చేయాల్సి వస్తే రూ.70 నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
కరోనా పేరిట దోపిడీ..
మూడు నెలలు నుంచి డెలివరీ కేసుల ఫీజులను పెంచినట్లు తెలుస్తోంది. ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పీపీఈ కిట్లు వాడుతున్నామని ఆసుపత్రుల యాజమాన్యం అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు కొవిడ్ లక్షణాలు లేకున్నా.. గర్భిణులకు కరోనా టెస్టుల చేయించి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చేర్చుకుంటున్నారు. ఈ టెస్టులు, పీపీఈ కిట్ల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. మొత్తానికి ప్రసవానికి ఆసుపత్రులకు వెళ్లితే గతంలో కంటే రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి దోపిడీకి సాక్ష్యాలు..
-బోయిన్ పల్లి ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నెలనెలా టెస్టులు చేయించుకుంది. కరోనా వల్ల ఆ ఆస్పత్రిలో డెలివరీ సదుపాయం లేకపోవడంతో మూడు రోజుల కిందట సికింద్రాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లింది. లక్ష రూపాయలు ముందుగా చెల్లిస్తేనే వైద్యం ప్రారంభిస్తామని ఆసుపత్రి యజమాన్యం చెప్పింది. చేసేదేమీ లేక సదురు కుటుంబ సభ్యులు అప్పో సప్పో తెచ్చి డబ్బులు చెల్లించారు.
– కామారెడ్డికి చెందిన ఓ నిండు గర్భిణి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోనే నెలనెలా పరీక్షలు చేయించుకున్నది. ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో కాన్పులు నిలిపివేయడంతో హైదరాబాద్ కు ఆమెను సోమవారం (ఈ నెల17న) కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆమెకు డెలివరీ చేసేందుకు సుచిత్రలోని ఓ ఆసుపత్రి ముందుగానే రూ.60 వేలు కట్టించుకుంది.
-మల్కాజిగిరి చెందిన ఓ గర్భిణికి అత్యవసరంగా ఆపరేషన్చేయాల్సి ఉంది. ఆమె భర్త ఓ ఆటో డ్రైవర్. తన భార్యను తీసుకోని ఆటోలో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్తే రూ.50 వేలు చెల్లించాలని చెప్పడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ ఆసుపత్రి యజమాన్యం సైతం అంతే మొత్తంలో డబ్బులు చెల్లించాలని చెప్పారు. తన భార్య పరిస్థితి విషమించే అవకాశం ఉండడంతో బంధువులు వద్ద అప్పు చేసి డబ్బులు ముట్టజెప్పాడు.