'చెట్టినాడ్‌' కంపెనీపై 100 టీమ్స్ సోదాలు

by Shamantha N |   ( Updated:2020-12-09 03:36:19.0  )
చెట్టినాడ్‌ కంపెనీపై 100 టీమ్స్ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, తెలంగాణ, ఏపీ, ముంబయ్‌లతో పాటు 40 ప్రదేశాల్లో 100 టీమ్స్ సోదాలు నిర్వహిస్తున్నాయి. చెన్నైలో చెట్టినాడు గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. చెట్టినాడ్‌కు సిమెంట్, పవర్, నిర్మాణం, స్టీల్ బిజినెస్‌లో వ్యాపారాలు ఉన్నాయి. చెట్టినాడ్ సంస్థ చైర్మన్ ముత్తయ్య నివాసంతో పాటు అయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed