చిన్నమ్మకు ఐటీ శాఖ బిగ్ షాక్

by Shamantha N |
చిన్నమ్మకు ఐటీ శాఖ బిగ్ షాక్
X

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయ లలితకు అత్యంత సన్నిహితురాలైన చిన్నమ్మ శశికళకు ఆదాయ పన్ను శాఖ భారీ షాకిచ్చింది. శశికళకు చెందిన సుమారు రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద స్తంభింపజేస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్రీజ్ చేసిన ఆస్తులు సిరుతవూర్, కొడనాడులో ఉండగా, ఇవి శశికళ ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరణ్ పేర్ల మీద ఉన్నట్టు ఐటీ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం వీరు ముగ్గురూ అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story