శానిటైజర్ ను ఎప్పుడు ఉపయోగించకూడదు?

by vinod kumar |
శానిటైజర్ ను ఎప్పుడు ఉపయోగించకూడదు?
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాతో కలిసి బతికే కాలం వచ్చేసింది. కరోనా భయమున్నా.. ఉద్యోగానికి, ఇతర అవసరాలకు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అందువల్ల ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయడం, ముఖానికి మాస్క్ ధరించడం వంటివి తప్పక పాటిస్తున్నాం. వీటితో పాటు ఇంట్లో, ఆఫీసులో తరచూ సబ్బుతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటున్నాం. బయటకు వెళ్లినప్పుడు మాత్రం హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తున్నాం. వైరస్ ను అంతం చేయడానికి శానిటైజర్ మంచి సాధనమే కానీ.. దేన్ని అతిగా వాడకూడదు. శానిటైజర్ ఎప్పుడూ ఉపయోగించకూడదో తెలుసా?

అతిగా శానిటైజర్ వాడుతున్నారా?

కరోనా కాలంలో.. శానిటైజర్ వాడటం సర్వసాధారణమైపోయింది. అయితే.. అతిగా శానిటైజర్ వాడటం వల్లే.. మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మన చేతులపై చెడు బ్యాక్టీరియాతోపాటు, మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఆ గుడ్ మైక్రోబైయోమ్స్ మన ఆరోగ్యాన్ని హెల్తీ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శానిటైజర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా కూడా చనిపోతాయి. అందుకే అత్యవసరమనుకున్నప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలి.

సబ్బు, నీళ్లు అందుబాటులో ఉన్నాయా?

అమెరికాకు చెందిన ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ గైడ్ లైన్స్ ప్రకారం వైరస్ కారక క్రిములను, బ్యాక్టీరియాను తొలగించాలంటే… 20 సెకన్లపాటు సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కుంటే సరిపోతుంది. సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంటే.. హ్యాండ్ వాష్ కు వాటిని ఉపయోగించడం బెటర్. వీలైనంత వరకు శానిటైజర్ వాడకపోవడమే శ్రేయస్కరం.

చేతులు మురికిగా ఉన్నాయా?

ఆటలు ఆడినప్పుడు, మొక్కలను క్లీన్ చేసి వాటర్ పట్టినప్పుడు, బైక్, కార్లకు చిన్న చిన్న రిపేర్లు చేసినప్పుడు ఇలా.. చాలా సందర్భాల్లో చేతులు చాలా మురికిగా కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో బ్యాక్టీరియా, వైరస్ లు ఎక్కువగా అటాక్ చేస్తాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో శానిటైజర్ వాడినా ఫలితం ఉండదు. అవి అంతగా మురికిని, బ్యాక్టీరియాను క్లీన్ చేయలేవు. అందువల్ల సబ్బుతో కడుక్కోవడమే ఉత్తమం.

పక్కన ఎవరైనా తుమ్మినా, దగ్గినా?

మనకు దగ్గర్లో ఎవరైనా తుమ్మినా, దగ్గినా.. శానిటైజ్ చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. తుమ్మినప్పుడు అవతలి వ్యక్తి చేతులు అడ్డుపెట్టుకున్నా, మాస్క్ ధరించినా.. డ్రాప్ లెట్స్ అంతగా వ్యాపించవన్నది అందరికీ తెలిసిందే. ఎక్కువగా అనుమానం పెట్టుకోకుండా.. అత్యవసరం అనిపిస్తే.. మాత్రమే శానిటైజర్ వాడాలి.

ఎదీ తాకకున్నా? ఎవరిని ముట్టుకోకున్నా?

తరుచుగా శానిటైజర్ వాడటం వల్ల.. వైరస్ దాని రెసిస్టెంట్ ను పెంచుకుంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఏదీ తాకకున్నా, ఎవరినీ ముట్టుకోకున్నా.. నిమిష నిమిషానికి శానిటైజర్ తీసి రుద్దుకోవడం చాలా మందిలో ఓ అలవాటుగా మారిందని, ఇది ఎంత మాత్రం మంచిది కాదని ఓ అధ్యయనంలో తేలింది.

5 నిముషాల క్రితమే?

ఎంతోమంది శానిటైజర్ పెట్టుకుంటారు. కానీ కొద్ది సమయంలోనే చేతులు డ్రైగా మారిపోతాయి. ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నా.. అలానే జరుగుతుంది. దాంతో శానిటైజర్ కంపెనీ అంత మంచిది కాదేమోనని ఫీల్ అవుతుంటాం. కానీ తరుచుగా శానిటైజర్ యూజ్ చేయడంతో.. చేతులు త్వరగా డ్రై అయిపోతాయి. స్కిన్ ఇరిటేషన్ కలుగుతుంది. అందుకే 5 నిముషాలకోసారి అప్లయ్ చేసే బదులు ఒకేసారి 20 సెకన్ల పాటు.. చేతులకు కింద, మీద బాగా శానిటైజర్ రుద్దుకోవడం బెటర్.

చిన్నపిల్లలకు ప్రమాదమే:

చిన్నారులు చేతులు కడుక్కోవడానికి శానిటైజర్ వాడితే ఏం కాదు. కానీ శానిటైజర్ తరుచుగా వాసన పీల్చినా.. పొరపాటున అది తాగినా.. అనారోగ్యానికి దారి తీస్తుంది.

కారులో శానిటైజర్ పెట్టవద్దు:

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. కారులో కానీ, ఇతర వేడెక్కే ప్రదేశాల్లో కానీ శానిటైజర్ ను పెట్టవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉండటంతో.. వేడి వల్ల అవి మండే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story