ఐపీఎల్‌లో నేడు… రసవత్తర పోరు

by Anukaran |
ఐపీఎల్‌లో నేడు… రసవత్తర పోరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర మ్యాచ్‌ జరుగనుంది. షార్జా వేదికగా రాత్రి 7:30 గంటలకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. ఈ పోరులో ప్లేఆఫ్స్ అవకాశాలను పదిలం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమి చెందితే… దాదాపు ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు అయినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ పంజాబ్ ఆడిన 11 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్‌లు ఆడగా ఆరింట్లో గెలిచింది. అయితే వరుసగా జోరు మీద ఉన్న రెండు జట్లు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని చూస్తున్నాయి. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్ వంటి స్టార్ బ్యాట్ మెన్స్ ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కు కలిసివస్తుంది. అలాగే సునీల్ నరైన్, నితీశ్ రానా వంటి వంటి ఆటగాళ్లు సైతం అద్భుతమైన ఫామ్‌లోకి రావడం కోల్‌కతాను కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed