ఐపీఎల్‌లో నేడు.. రసవత్తర పోరు

by Anukaran |
ఐపీఎల్‌లో నేడు.. రసవత్తర పోరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం రసవత్తర పోరు జరుగనుంది. షార్జా వేదికగా రాత్రి 7:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్‌కు చాలా కీలకం కానుంది. ప్లేఆఫ్స్ రేసులు ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. ఐపీఎల్‌లో మొత్తం ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ పది పాయింట్లు సాధించింది. అంతేగాకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఎలాగైనా నెగ్గాలని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే.. హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండవు. ఈ క్రమంలో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.

Advertisement

Next Story