ఆటా, పాటల్లోనూ ఆదర్శం

by Shamantha N |

దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ 21 రోజుల లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అన్ని రాష్ట్రాల ప్రజలు ఇండ్లల్లోనే ఉంటున్నారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం ప్రజలు లాక్‌డౌన్‌లో కాస్త భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ఐజ్వల్‌లో ఒక దగ్గర పెద్ద సౌండ్ సెట్ ఏర్పాటు చేసుకున్నారు. అందుల్లోంచి పాటలు హోరెత్తుతుండగా బాల్కనీలు, టెర్రస్‌పై నుంచి కుటుంబ సమేతంగా సామూహిక దూరం పాటిస్తూ నృత్యాలు చేశారు. లాక్‌డౌన్‌లో ఆదర్శంగా నిలుస్తున్న ఐజ్వల్ వాసులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీరు నృత్యాలు చేస్తున్న వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Tags: Mizzoram lock down,India lockdown, corona virus

Advertisement

Next Story