కొవిడ్ వ్యాక్సిన్‌ వేసుకోవడం ఇష్టం లేక ఏకంగా ‘నకిలీ చేయి’ పెట్టుకున్న డాక్టర్..

by Shyam |   ( Updated:2021-12-08 01:02:38.0  )
vaccine
X

దిశ, ఫీచర్స్: డేల్టా వేరియంట్ తర్వాత ప్రస్తుతం అన్ని దేశాల్లో ‘ఒమిక్రాన్’ కేసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో చేసిన తప్పుల్ని మరోసారి చేయకుండా ఉండేందుకు తొలి కేసు నమోదైన నాటి నుంచే అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మరోసారి మాస్క్ ధరించడం తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు పబ్లిక్ స్పాట్‌లపై పరిమిత ఆంక్షలు నిర్దేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు టీకాలు వేసుకోని వ్యక్తులు సామాజిక, సాంస్కృతిక, క్రీడా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధనలు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పొందేందుకు నకిలీ చేయి ధరించి టీకా తీసుకోవడం గమనార్హం.

చాలా మంది వ్యక్తులు టీకాపై అనుమానం వ్యక్తం చేస్తూ, టీకాకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు టీకా వ్యతిరేక ప్రచారాన్ని అనుసరిస్తున్న యాంటీ వ్యాక్సినేటర్స్‌లో ఒకరు వ్యాక్సిన్ షాట్‌ను తప్పించేకుని, సర్టిఫికేట్ పొందేందుకు వందలాది యూరోలు వెచ్చించి సిలికాన్ ప్రొస్తెటిక్‌ ఆర్మ్‌ను కొనుగోలు చేశాడు. తన నిజమైన చేతిని కప్పి ఉంచేందుకు ఈ సిలికాన్ అచ్చును పెట్టుకున్నాడు. అయితే వ్యాక్సిన్ వేస్తున్న క్రమంలో ఏదో తప్పు జరిగిందని వెంటనే నర్సు గ్రహించింది. దీంతో ఆ నర్సు వెంటనే బియోల్లా సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి పేరు వెల్లడి కాలేదు కానీ, ఈ క్రేజీ స్టంట్‌‌కు ప్రయత్నించిన వ్యక్తి దంతవైద్యుడని అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. వ్యాక్సిన్ నిరాకరించిన రోగులకు నకిలీ టీకా సర్టిఫికేట్లు జారీ చేసినందుకు రవెన్నాలోని ఒక వైద్యుడిని అరెస్టు చేసిన నెల తర్వాత ఈ సంఘటన బయటకు రావడం గమనార్హం.

‘ఒక ప్రొఫెషనల్‌గా బాధపడ్డాను. తొలిగా అతడి చేతిని గుర్తించడంలో విఫలమయ్యాను. అతడికి షాట్ ఇచ్చే సమయంలో చేయి రబ్బర్‌‌లా, చల్లగా తోచింది. అతడి వీన్స్ కనిపించలేవు. ఇచ్చిన తర్వాత అది కృత్రిమ చేయి అనే సందేహం రావడంతో పోలీసులకు సమాచారం అందించాను. కొవిడ్ వల్ల ఇప్పటికే ఎంతోమంది తమ జీవితాలను నష్టపోయారు. ఆర్థికంగానూ కోలుకోలేనివిధంగా దెబ్బతిన్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని నర్సు వివరించింది.

థర్డ్ వేవ్‌కు ప్రభుత్వం సిద్ధం.. 100 పడకలు వార్డ్ షురూ

Advertisement

Next Story