- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీకి సెప‘రూటు’
పార్లమెంటు సెషన్స్ జరిగే సమయంలో ప్రధాని మోడీ, ఇతర కేంద్రమంత్రులు, వీవీఐపీలు వెళ్లేటప్పుడు సాధారణంగా ట్రాఫిక్ నిలిపి వేస్తుంటారు. అంతేకాకుండా రోజువారీగా ఎవరో ఒక వీఐపీ తమ కార్యకలాపాలు నిర్వర్తించేందుకు ఢిల్లీ రోడ్లపై జర్నీ చేస్తుంటారు. దీంతో ప్రతిసారీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.ఇక నుంచి వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రధాని పార్లమెంటుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా టన్నెల్ మార్గం సిద్ధమవుతోంది. ‘సెంట్రల్ విస్టా’ ప్రాజెక్టులో భాగంగా దీనిని చేపడుతున్నట్టు ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించారు. ఇక నుంచి వీఐపీలు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఈ టన్నెల్ ద్వారనే వెళ్తారని దీంతో సామాన్యులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయని వివరించారు.ఈ క్రమంలోనే ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకూ ఓ టన్నెల్ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసాన్ని కూడా సౌత్‌బ్లాక్‌కు మారుస్తున్నట్టు తెలుస్తోంది.