- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి.. ఇన్‌చార్జి ఎస్పీ ఆదేశం
by Aamani |
X
దిశ, లోకేశ్వరం: పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన లోకేశ్వరం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు లోకేశ్వరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్‌కు విశాలమైన ఆవరణ ఉందని, మొక్కలు నాటి, సంరక్షించాలని ఎస్ఐ సాయి కుమార్‌కు సూచించారు. అలాగే పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ప్రతిరోజూ పెట్రోలింగ్ నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
Advertisement
Next Story