సెహ్వాగ్ పెద్ద తెలివైనవాడేం కాదు : అక్తర్

by Shyam |
సెహ్వాగ్ పెద్ద తెలివైనవాడేం కాదు : అక్తర్
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్‌ను వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చిన పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశాడు. టీమ్ ఇండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటే ఇమ్రాన్ నజీర్ ఎక్కువ తెలివైనవాడని అన్నాడు. కానీ సెహ్వాగ్‌లా అతడు బుర్ర ఎక్కువగా ఉపయోగించడని చెప్పాడు. ‘వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద తెలివైనవాడేం కాదు కానీ.. సమయస్ఫూర్తితో ఆడేవాడని, ఇద్దరూ ప్రతిభావంతులైన క్రికెటర్లే.. అయితే ఇద్దరినీ పోల్చి చూడలేమని అక్తర్ పేర్కొన్నాడు. భారత్‌పై విధ్వంసకర శతకం బాదిన తర్వాత ఇమ్రాన్ నజీర్‌ను జట్టులో కొనసాగించేందుకు వీలుగా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని తాను కోరినట్లు చెప్పాడు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నజీర్‌ను ఎక్కువగా పట్టించుకోలేదని అక్తర్ విమర్శించాడు.

ప్రతిభావంతులు ఎదిగేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎప్పుడూ వ్యవహరించలేదని అక్తర్ ఆరోపించాడు. నజీర్‌ను కనుక మేం కాపాడుకుని ఉంటే సెహ్వాగ్ కంటే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను మనం చూసే వాళ్లమని అన్నాడు. నజీర్ అద్భుతమైన షాట్లు కొట్టడమే కాదు. అతనో మంచి ఫీల్డర్ కూడా అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ తరపున 8 టెస్టులు ఆడిన నజీర్ 427 పరుగులు చేశాడు.

Tags : Cricket, Shoab Aktar, Imran Nazeer, Virendra Sehwag, PCB

Advertisement

Next Story