ఛీఛీ.. ఇంత దిగజారాలా.. లిప్ లాక్ కోసం హీరోయిన్ కాళ్లు ఒత్తిన స్టార్ హీరో

by Anukaran |   ( Updated:2021-09-21 06:01:44.0  )
ఛీఛీ.. ఇంత దిగజారాలా.. లిప్ లాక్ కోసం హీరోయిన్ కాళ్లు ఒత్తిన స్టార్ హీరో
X

దిశ, వెబ్ డెస్క్: ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వాలి. కొందరు హీరోస్.. ఒకే హీరోయిన్ ని రిపీట్ చేయడానికి కారణం అదే. అయితే ఆ కెమిస్ట్రీ సినిమా వరకు మాత్రమే ఉంటే బావుంటుంది.. కానీ కొంతమంది హీరోలు దాన్ని సినిమా బయట కూడా కంటిన్యూ చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ఇక ఇండస్ట్రీలో ఇలాంటివి సాధారణమే కానీ, హీరోయిన్ ల తో లిప్ లాక్ లు కావాలని, ఆమెతో రొమాన్స్ సీన్స్ కావాలని దర్శకులను డిమాండ్ చేస్తున్నారట కొంతమంది హీరోలు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఒక హీరో మాత్రం సెట్ లోనే రెచ్చిపోయాడు. ముందు వెనుక మరిచి, తనొక స్టార్ హీరో అన్న విషయాన్నీ పక్కన పెట్టి దిగజారి ప్రవర్తించాడన్న టాక్ ఇండస్ట్రీని ఊపేస్తోంది. సెట్ లో హీరోయిన్ తో లిప్ లాక్ కోసం ఆమె కాళ్లు ఒత్తడంతో యూనిట్ సభ్యులంతా షాక్ అయ్యారట.. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే.. బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ హీరో.. ఇమ్రాన్ హష్మీ.

ఇమ్రాన్ హష్మీ గురించి, అతని లిప్ లాక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా అతడు చేసిన ఒక పని నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ నర్గీస్ ఫక్రి, ఇమ్రాన్ హష్మీ ఒక సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ షూటింగ్ సమయంలో ఇమ్రాన్ చేసిన ఒక పని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. లిప్ కిస్ సన్నివేశం జరుగుతుండగా.. నర్గీస్ కాలు పట్టేసింది. దీంతో అక్కడ ఉన్న వారందరు ఆమెను పట్టుకోవడానికి వచ్చినా.. ఇమ్రాన్ వారిని ఆపి, స్వయంగా ఆయనే నర్గీస్ కాళ్లు పట్టుకొని వత్తడానికి సిద్దమయ్యాడట. దీంతో అక్కడున్నవారందరు షాక్ తో ముక్కున వేలేసుకొన్నారట. ఆ హీరో ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకొని ఒత్తుతున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఆమెతో లిప్ లాక్ కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించాలా..? అని కొందరు.. దానికోసం ఈ నటీనటులు బాగా దిగజారి పోతారు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ముంబైకి మకాం మార్చనున్న సమంత.. అందుకేనా?

Advertisement

Next Story

Most Viewed