- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానాలు విధింపు
దిశ, అందోల్: కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యాపారులపై సదాశివపేట మున్సిపల్ అధికారులు జరిమానా విధిస్తున్నారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి పట్టణంలో అకస్మికంగా పర్యటించగా.. కరోనా నిబంధనలను పాటించకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న 5 దుకాణాలకు జరిమానాలను విధించినట్లు ఆయన తెలిపారు. సాయిగణేష్ షాపింగ్ మాల్ కు రూ.15 వేలు, సాయిరాం షాపింగ్ మాల్ కు రూ.15 వేలు, బరాడి డ్రెస్సెస్ అండ్ క్లాత్ మర్చంట్ రూ.10 వేలు, కృష్ణ క్లాత్ మర్చంట్ కు రూ.5వేలు, ఏ1 బ్యాంగిల్ స్టోర్స్ కు రూ.500లు మొత్తం రూ.45500ల జరిమానాలను విధించినట్లు ఆయన తెలిపారు. మరోసారి కొవిడ్ నిబంధనలను పాటించకపోతే జీవో నెంబర్ 68 ప్రకారం దుకాణాలను మూసి వేస్తామని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.