థర్డవేవ్ నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచుకోండిలా..

by sudharani |   ( Updated:2021-08-07 02:05:20.0  )
థర్డవేవ్ నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచుకోండిలా..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనాతో ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. రోగ నిరోధక శక్తి ఉన్నవారు మాత్రమే కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో డాక్టర్లు, అధికారులు, శాస్త్రవేత్తలు పదే పదే ప్రస్తావిస్తున్న అంశం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం. దీంతో అందరూ మంచి ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపారు. ఇప్పుడు థర్డవేవ్ ముప్పు ముంచి ఉన్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజు వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ సీ ఉన్న ఆహారం తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు, జింక్ అధికంగా లభ్యమయ్యే లీన్ మటన్, చేపల్ని తినాలి. జంగ్ ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్‌ను తినడం మానేయాలి. ఇంట్లో తయారుచేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీ శరీరానికి పడని ఆహారం జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆహారంలో పసుపు విరివిగా తీసుకోవాలి. లేకపోతే గోరు వెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని తాగడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. వంటలో వెల్లుల్లి ఎక్కువగా ఉపయోగించాలి. వెల్లుల్లిలో ఉండే పోషకాలు, యాంటీ బయాటిక్‌గా పనిచేస్తాయి. వెల్లుల్లితో పాటు అల్లంను మన ఆహారంలో తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ, డీ, ఈ విటమిన్లు అధికంగా ఉండే పదార్థాలు, జింక్, సెలీనియం ఉండే పోషక పదార్థాలు మిమ్మల్ని మరింత ఆరోగ్యవంతంగా చేస్తాయి. అంతే కాకుండా బయట ఆహారాన్ని తినడం పూర్తిగా మానేయాలి. సాధ్యమైనంత వరకు ఇంటిలోని ఆహారాన్ని తీసుకోవడాని ప్రయత్నించాలి. వంటలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లిని తప్పకుండా వాడాలి. వాటిలో రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రతీ రోజు ఫ్రీజ్‌ వాటర్‌, మామూలు వాటర్‌ తాగకుండా కాస్త గోరువెచ్చని నీళ్లను తాగుతుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలుండవు.

Advertisement

Next Story