- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్..
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా.. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. అత్యవసరమైతేనే హాస్పిటల్‌కు రావాలని కూడా చెబుతోంది. ఈ తరుణంలో.. వీలైనంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండటమే అన్నింటికన్నా మేలు. అయితే.. కరోనా బాధితుల చెబుతున్న స్వీయ అనుభవాలతో పాటు వైద్యులు, నిపుణుల సూచనల మేరకు రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే.. కరోనాను ఎదుర్కోవచ్చనేది మన ముందు కనిపిస్తున్న వాస్తవం. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది?
మునక్కాయలు
ఇమ్యూనిటీని పెంచడంలో.. మునక్కాయలది ప్రముఖ పాత్ర. మునగాకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని సంప్రదాయక మందుగానూ పెద్దలు గుర్తించారు. ఆస్తమా, బ్రాంకైటిస్, టీబీ వంటి శ్వాసకోశ వ్యాధుల నివారణలోనూ మునగాకు బాగా పనిచేస్తుంది. ఇందులోని ఐరన్, కాల్షియం, విటమిన్లు.. ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరుస్తాయి. మునగకాయల్లోని యాంటీ బ్యాక్టీరియల్ సుగుణాల వల్ల ఇన్‌ఫెక్లన్లు సోకవు. ముఖ్యంగా గొంతు, చర్మం, ఛాతి ఇన్‌ఫెక్షన్లు రావు. చర్మ సంబంధ ఫంగల్ సమస్యలు నివారించడంలోనూ బాగా పనిచేస్తుంది. మునక్కాయల్లో పుష్కలంగా ఉండే ‘విటమిన్లు సీ, ఏ’లు.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి.
కోకోనట్ వాటర్ + లెమన్
ఫ్రెష్ కోకోనట్ వాటర్‌తో హాఫ్ లెమన్ కలిపి తాగితే.. సీ విటమిన్ పది రెట్లు అందుతుంది. ప్రస్తుత కరోనా టైమ్‌లో ప్రతీరోజు ఇలా తాగడం ఎంతో ప్రధానం. కిడ్నీ పేషెంట్లు మాత్రం కోకోనట్ వాటర్ తాగకూడదని గుర్తుంచుకోండి.
ఉల్లి, వెల్లుల్లి, పసుపు
పూర్వ కాలం నుంచి నేటి టెక్ యుగం వరకు.. అందరికీ తెలిసిన సూపర్ ఫుడ్స్ ‘ఉల్లి, వెల్లుల్లి, పసుపు’. హానికర బ్యాక్టీరియాను కిల్ చేయడంలో వీటి తర్వాతే ఏవైనా. ఇమ్యూనిటీ పెంచడంలో, ఆరోగ్యాన్ని కాపాడటంలో.. ఇవి చాలా బాగా పనిచేస్తాయి. రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకున్నట్టయితే వైరస్‌ల నుంచే కాదు.. ఎన్నో సీజనల్ వ్యాధులు, ఇతర అనారోగ్యాల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
గుమ్మడి గింజలు
శరీరానికి సరిపడా హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం, జింక్ అందాలంటే.. ప్రతిరోజు 3,4 చెంచాల గుమ్మడి గింజలు తింటే సరిపోతుంది. వాటిలో ఉన్న పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. గుమ్మడి గింజల్లో మాంగనీస్, కాపర్, పాస్పరస్, ఐరన్.. వంటి ఎన్నో ఖనిజాలతో పాటు ప్రొటీన్లు, ఏ, బీ విటమిన్లు లభ్యమవుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుమ్మడి గింజల్లో కాపర్ శాతం అధికం. ఇవి ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడటంతో పాటు రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి.
రెడ్ క్యాప్సికమ్
చాలా మంది ‘విటమిన్ సీ’ కోసం ఆరెంజ్ తినాలని చెబుతుంటారు. కానీ అంతకు మూడు రెట్ల ‘సీ విటమిన్’ రెడ్ క్యాప్సికమ్‌లో దొరుకుతుంది. ప్రతి రోజు భోజనానికి ముందు రెడ్ క్యాప్సికమ్ సలాడ్ తింటే చాలు.. సీ విటమిన్ పుష్కలంగా అందుతుంది.