- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠశాల స్థాయిలోనే కల్మషం లేని స్నేహం
దిశ, ఆత్మకూరు (ఎస్): పాఠశాల స్థాయిలో ప్రతి విద్యార్థి కల్మషం లేకుండా ఉంటారు కాబట్టే స్నేహాభావం కలిగి ఉంటారని ప్రముఖ డాక్టర్ దశరథ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నెమ్మికల్‌లో జరిగిన 1987-88 ssc బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నాటి స్నేహబంధాలు నేటి తరం విద్యార్థుల్లో కనిపించడం లేదని అన్నారు. ఆటలు, కబుర్లు మరిచి సెల్ ఫోన్లకే పరిమితం అవుతున్నారని వాపోయారు. నేటి స్నేహం హాయ్.. బాయ్ లకే పరిమితం అయిందని విచారం వ్యక్తం చేశారు.
అనంతరం క్లాస్ మెంట్ భూపతి రాములు రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను తోటి మిత్రుల ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గురుస్వామి, బొల్లెద్దు వెంకటరత్నం (బీవీఆర్), డాక్టర్ దశరథ సత్యనారాయణ రెడ్డి, గురువయ్య, సుధామని, శోభారాణి, అలివేలు, ఉప్పమ్మ, గౌసియా బేగం, గురువయ్య, పొన్నం వీరయ్య, జలగం కృష్ణయ్య, నర్సిరెడ్డి, లచ్చు శ్రీనివాస్, రెడ్డి రత్నమ్మ, సుధామణి, శోభా రాణి, వీరయ్య, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.