- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది : ఐఎమ్ఎఫ్!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న భారత ఆర్థికవ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ( ఐఎమ్ఎఫ్) అభిప్రాయపడింది. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా కోలుకుంది. తయారీ రంగం కార్యకలాపాలు మునుపటి స్థాయికి చేరుకోవడం, డిమాండ్ మెరుగుపడటంతోనే జీడీపీ 7.5 శాతం ప్రతికూలానికి పరిమితమైందని, వినియోగదారుల డిమాండ్ మెరుగుదలపై ఆశలున్నాయని పేర్కొంది.
‘భారత ఆర్థికవ్యవస్థ కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ ప్రభావితమైనప్పటికీ క్రమంగా కోలుకుంటోందని, ఆర్థిక, ద్రవ్య. ఆర్థిక రంగాల్లో తీసుకున్న కీలక చర్యల నేపథ్యంలో ఆర్థికవ్యవస్థకు తోడ్పాటు నందించాయని, వీటితో పాటు వ్యాపారం, వ్యవసాయ రంగాలు ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంలో సఫలమయ్యాయని ఐఎమ్ఎఫ్ చీఫ్ ప్రతినిధి జెర్రీ రైస్ చెప్పారు. ఆర్థిక వృద్ధికి మద్దతునిస్తూ, ప్రస్తుతం వెల్లడించిన కార్యక్రమాలు వేగవంతంగా అమలయ్యేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.