ఒమిక్రాన్ కారణంగా భారీ థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం.. IMA హెచ్చరిక

by Anukaran |   ( Updated:2021-12-08 01:19:59.0  )
Corona third wave
X

దిశ, వెబ్‌డెస్క్: ఒమిక్రాన్ వైరస్ కారణంగా భారీ ఎత్తున థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని ఐఎంఏ(ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్) హెచ్చరికలు చేసింది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండంకెలకు చేరిందని, రాబోయే రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 12 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని సూచనలు చేసింది. కాగా, సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ టీకా అదనపు డోసులపై ప్రకటన చేయాలని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, అలాగే మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అని సూచించింది. నిర్లక్ష్యం చేస్తే వైరస్ భయంకరంగా విరుచుకుపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

థర్డ్ వేవ్‌కు ప్రభుత్వం సిద్ధం.. 100 పడకలు వార్డ్ షురూ

Advertisement

Next Story