IMA దాతృత్వం..ప్ర‌భుత్వ వైద్యుల‌కు 50 కిట్లు అందజేత

by Shyam |
IMA దాతృత్వం..ప్ర‌భుత్వ వైద్యుల‌కు 50 కిట్లు అందజేత
X

దిశ, న‌ల్ల‌గొండ‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ, నిస్పక్షపాతంగా సేవలందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు IMA(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) వారు వ్యక్తిగత రక్షణ దుస్తులను సోమవారం అందజేశారు. ఈ దుస్తులను అపర్ణ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ హుస్సేన్ రెడ్డి విరాళం ప్రకటించారు. ఉదయం జిల్లా ప్రభుత్వ వైద్య శాలలో 50 కిట్లను సూపరింటెండెట్ నరసింహా గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా హుస్సేన్ రెడ్డి, డాక్టర్ పుల్లా రావు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహ దాతలను, ఐఎంఏ చేసిన సాయానికి అభినందించినారు. కార్యక్రమములో డాక్టర్ రాం మోహన్ రావు, డాక్టర్ ఉదయ్ సింగ్, డాక్టర్ నగెష్ హెడ్, నర్సు ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Tags: corona,lockdown, 50 medical kits to govt hospital doctors, nalgonda, ima

Advertisement

Next Story