- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. బాన్సువాడలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత(వీడియో)
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట ప్రైమరీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో భోజనం తిన్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. హుటాహుటిన తల్లిదండ్రులు తేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ భోజనంలో నాసిరకంతో పాటు పాడైన పదార్థాలు వడ్డించడం వల్లనే అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ విషయమై పాఠశాల అధికారులను పేరెంట్స్ నిలదీశారు. స్థానిక లీడర్లు జోక్యం చేసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర్ రావును వివరణ కోరగా పది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం వాస్తవమేనని అన్నారు.
ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కారణాలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.