గద్వాల జిల్లా సరిహద్దుల్లో మద్యం పట్టివేత 

by Shyam |
గద్వాల జిల్లా సరిహద్దుల్లో మద్యం పట్టివేత 
X

దిశ, మహబూబ్ నగర్ : జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దు గుండా ఏపీ రాష్ట్రంలోని కర్నూలుకు అక్రమంగా తరలిస్తున్న మద్యం స్టాక్‌ను అలంపూర్ పోలీసులు పట్టుకున్నారు.బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు అలంపూర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ర్యాలం పాడు గ్రామానికి వెళ్లే మార్గమధ్యలో బ్రిడ్జి మీద తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో కర్నూలు పట్టణం నంద్యాల చెక్ పోస్ట్‌కు చెందిన క్రాంతి కుమార్ తన కారులో మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నాడు. ఆ వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా అందులో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అలంపూర్ నుంచి తక్కువ రేటు గల మద్యాన్ని కొనుగోలు చేసి కర్నూలు పట్టణంలో విక్రయించేందుకు తరలిస్తున్నట్టు అంగీకరించాడు. కారులో దొరికిన వాటిలో రాయల్ గ్రీన్ 750ml 5 బాటిళ్లు, సిగ్నిచర్ 375 ml 12 బాటిళ్లు, 100 పైపర్స్ 375ml 20 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వీటి విలువ సుమారు 30వేలు ఉంటుందని గుర్తించారు. అక్రమ మద్యాన్ని తరలించడానికి ఉపయోగించిన AP21BW6641 నెంబరు గల వాహనాన్ని కూడా సీజ్ చేసి, సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసినట్టు అలంపూర్ ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed