- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయ భూముల్లో అక్రమ వెంచర్లు.. 150 కోట్ల భూ దందా..
దిశ ప్రతినిధి, మేడ్చల్ : కీసర గుట్ట దేవాలయ భూమిని ఆక్రమించుకొని అక్రమ లేవుట్ చేస్తున్నారని ఆలయ భూముల రక్షిత కౌలుదారుల వారసులు రాగుల అనుసూయ, సత్యనారాయణ, సాయి లు ఆరోపించారు. సోమవారం కీసరలోని మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కీసర గుట్ట సమీపంలో దేవాలయానికి సంబంధించి నంది బావి దగ్గరలో గల భూముల సర్వే నంబర్లు (పాత నంబర్లు 85,86) 33,34,55,56, 272 లలో దాదాపు 28 ఎకరాల భూమి ఉండేదని అన్నారు. ప్రభుత్వం తరపున నాటి ప్రధాన అర్చకులు రామన్న పూజారి పేరుపై భూమి ఉండేదని, కౌలు రైతు గా మా తాత రాగుల బాలయ్య కౌలు చేసేవారని తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని అట్టి ప్రధాన అర్చకునికి ఇచ్చే వారన్నారు.
అయితే ప్రధాన అర్చకునికి పిల్లలు లేరని, సిద్దిపేటకు చెందిన తాటకం కుటుంబ సభ్యులు అధికారులను ప్రలోబపెట్టి కౌలు దారులుగా ఉన్న మా పెద్దల పేర్లు రికార్డుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ భూములలో అక్రమంగా వెంచర్లు వేసి రూ.150 కోట్ల భూ దందాకు తెరలేపారని ఆరోపించారు. దేవాలయ భూములను ఆక్రమించుకొని అక్రమంగా వెంచర్లు వేస్తున్నారని ఇప్పటికే మండల రెవెన్యూ అధికారితో పాటు మంత్రి మల్లారెడ్డికి సైతం గ్రామ పెద్దలు ఫిర్యాదులు చేసినట్లు వివరించారు. భూమిని రక్షించేందుకు కోర్టులో సైతం కేసు వేశామని, అయినా ఆలయ భూములలో హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చిందంటూ అక్రమంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం అక్రమ వెంచర్ పై విచారణ జరిపి, ఆలయ భూములను పరిరక్షించాలని కోరారు.