- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాళ్లకో న్యాయం.. మాకో న్యాయమా..?
దిశ, అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇసుక కోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలలో భాగంగా నిర్మించే పనులకైనా, ప్రజల సొంత నిర్మాణ పనులకైనా ఇసుక కోసం ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. స్థానికంగా ఉన్న వాగుల నుంచి ఇసుక రవాణా చేస్తే వాహనాలను సీజ్ చేస్తున్నారు. మరుగుదొడ్ల, డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర ప్రభుత్వ పనులకు అవసరమైన ఇసుక కోసం అధికారుల చుట్టూ తిరిగి కూపన్లు తీసుకున్న తర్వాత మాత్రమే ఇసుక రవాణా చేసుకోవాలి. కానీ, వందల ట్రిప్పుల ఇసుకను రవాణా చేసినా, నిల్వ ఉంచినా అధికారులు మాత్రం చర్యలకు ఉపక్రమించక పోవడంపై మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ శివారులో సీతారామ కాలువ నిర్మాణ పనులు చేపట్టిన ఓ నిర్మాణ సంస్థ స్థానిక వాగులో నుంచి భారీగా ఇసుకను తరలించి నిల్వలు ఉంచినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
సీతారామ కాలువ నిర్మాణ పనులలో భాగంగా మర్రిగూడెం గ్రామంలోని ఏదుళ్ల వాగుపై ఓ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. బ్రిడ్జి పనులు చేపట్టే ప్రదేశంలో భారీగా ఇసుక నిల్వలు ఉండడంతో వాటిపై నిర్మాణ సంస్థ కన్ను పడింది. పనులకు అడ్డొస్తుందనే నెపంతో అక్కడ ఉన్న ఇసుకను టిప్పర్ లారీలతో అక్రమంగా తరలించి సమీపంలోని క్యాంపు ప్రాంగణంలో భద్రపరిచారు. భారీగా ఇసుక నిల్వలను భద్రపరిచినా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు, మండల ప్రజలు మండిపతున్నారు. భారీగా ఇసుక నిల్వలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు అంటున్నారు. నిర్మాణ సంస్థలకు ఒక న్యాయం.. సామన్య తమకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు . అధికారులు ఇసుకను వెంటనే సీజ్ చేసి వేలం నిర్వహించాలని కోరుతున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఎమ్మార్వోను దిశ వివరణ కోరగా ‘ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంతే ఉన్నది.. నేను కూడా స్వాధీనపరచు కోలేదు’ అని తెలియజేశారు.