మెప్మాలో పైసా వసూల్.. రుణాలు వస్తే చాలు.. పర్సంటేజీలు…

by Shyam |   ( Updated:2021-06-10 07:56:13.0  )
Illegal Money collection in MEPMA (Telangana State Mission for Elimination of Poverty in Municipal Areas)
X

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పొదుపు సంఘాల ద్వారా రుణాలు తీసుకున్న మహిళలకు సీఏలు కుచ్చు టోపీ పెట్టారు. మండలాలలో ఆయా గ్రామ పంచాయతీలలో సంఘాలు ఉండగా శ్రీనిధి డబ్బులు తీసుకున్న మహిళా సంఘాల నుండి సీఏలు అదనపు వసూళ్లు చేయడంతో మహిళలు ఆవేదనకు గురవుతున్నారు. పైసా పైసా కూడబెట్టి పొదుపు చేసుకునే డబ్బులను సీఏలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అదనంగా వసూళ్లు చేయడంతో అధికారుల అవినీతికి హద్దూ పద్దూ లేకుండా పోయింది. ఇలాంటి ఘటన నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర గుర్రంపోడు తిరుమలగిరి లో చోటుచేసుకుంది.

కరోనా కాలంలో సంఘాల మధ్య సమన్వయం లేకపోవడంతో చేతివాటం పుచ్చుకుంటున్నారు అని నియోజకవర్గం లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ఐకేపీ అధికారులకు చీమకుట్టినట్లుగా లేకపోవడంతో శ్రీనిధి అధికారులు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మూడు మండలాలు గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి, సాగర్ మండలాలలో ఇష్టానుసారంగా వ్యవహరించడంతో డ్వాక్రా మహిళలు దోపిడీకి గురవుతున్నారు. మహిళాల ఆర్థికాభివృద్ధి కోసం పొదుపు సంఘాలు అంటూ ఒక వైపు ప్రభుత్వాలు చెబుతుంటే మరో వైపు మెప్మా సిబ్బంది పైసా వసూల్‌లో మునిగితేలుతోంది.

మహిళా సంఘాలకు రుణాలు వస్తే చాలు పర్సంటేజీలు చెల్లించాల్సిందే. పైసా వసూల్‌లో ఆర్‌పీ వ్యవస్థ కీలకంగా పనిచేస్తోంది. కింది నుంచి పైస్థాయి వరకు ఇవ్వాల్సిందే గత కొంత కాలంగా మెప్మాలో ఆర్‌పీల హవా కొనసాగుతోంది. సీవోలు తెరవెనుక ఉంటూ ఆర్పీలచే వసూలు చేయిస్తున్నారు. పైసా వసూళ్లలో ఆర్పీలు, సీవోలు ముందుంటూ రుణాల రికవరీలో ఓబీలను ముందు పెడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో సభ్యులకు ఓబీలకు మధ్య రుణ రికవరీ సమయం లో గొడవలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రతి చిన్న దానికి కూడా పైస లేనిదే పనిజరగడం లేదని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. మెప్మా సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed