- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిమాన్షుపై వాడిన భాష సమర్ధనీయం కాదు: ఐజేయూ, టీయూడబ్ల్యూజే
దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై ఓ యూ ట్యూబ్ ఛానెల్ లో తీన్మార్ మల్లన్న వాడిన భాష, వ్యాఖ్యలు ఏ మాత్రం సమర్థనీయం కాదని ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా ఖడించారు. ఓ రాజకీయ పార్టీ విశ్వాసాల్ని పవిత్రమైన జర్నలిజానికి జతకట్టడం సహించరాని అనైతికమని స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛ దుర్వినియోగం ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీలు ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాల వార్తల వెల్లడికి ఎలాంటి సాహసాలకైనా పూనుకోవచ్చని, అయితే ఆ ముసుగులో జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం వృత్తి ధర్మాన్ని అపహాస్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.