క్యాన్సర్ కణజాలంను గుర్తించే ‘ఆల్గారిథం’ వచ్చేసింది

by Shyam |
iit-madrass
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న మహమ్మారి ‘క్యాన్సర్’. జన్యుమార్పులతో క్యాన్సర్ వస్తుందని తెలిసిన విషయమే. దీని బాధితుల్లో కణజాలం అనవసరంగా, ఆగకుండా విపరీతంగా వృద్ధి చెందుతుంటోంది.అయితే క్యాన్సర్‌కు దారితీసే శరీర కణాల్లో జరుగుతున్న మార్పులను గుర్తించే ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గణిత నమూనాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాసు పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ఐఐటీ మద్రాస్ పరిశోధకులు డెవలప్ చేసిన అల్గారిథం క్యాన్సర్ పురోగతికి కారణమైన జన్యు మార్పులను గుర్తించడానికి డీఎన్‌ఏను విశ్లేషిస్తుంది. జన్యుపరమైన మార్పులను గుర్తించటమే ఇంతకాలం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలు కాగా, ఇందులో భాగంగా క్యాన్సర్ కణాల వృద్ధికి కారణభూతమయ్యే డ్రైవర్ ఉత్పరివర్తనాలకు, వ్యాధి‌ పురోగతిపై ఎటువంటి ప్రభావం చూపని పాసింజర్ మార్పులకు మధ్య తేడాను సులభంగా గుర్తించనున్నారు. తద్వారా ఏవైతే కణాలు వ్యాధి తీవ్రతకు కారణమౌతున్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అధునాతన AI పద్ధతులను ఉపయోగించి, పరిశోధకులు NBDriver అనే నావల్ ప్రిడిక్షన్ అల్గారిథాన్పి అభివృద్ధి చేయడంతో పాటు అనేక ఓపెన్-సోర్స్ క్యాన్సర్ మ్యుటేషన్ డేటాసెట్లలో దాని పనితీరును పరీక్షించారు.

‘మా మోడల్ 89 శాతం కచ్చితత్వంతో డ్రైవర్ అండ్ పాసింజర్ మ్యూటేషన్స్ మధ్య తేడాను గుర్తించగలదు. ఇది ఇప్పటికే వాడుకలో ఉన్న గత మోడళ్లతో పోల్చితే మంచి ఫలితాలను కచ్చితత్వంతో అందించింది. సాధారణ క్యాన్సర్లే కాకుండా అరుదైన గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్ (జిబిఎం) క్యాన్సర్ రకాన్ని కూడా ఇది 85శాతం అక్యురేట్‌గా గుర్తిస్తుంది. ఈ రకమైన క్యాన్సర్ మెదడు లేదా వెన్నెముకను ప్రభావితం చేస్తుంది. ఎన్‌బీడీ డ్రైవర్ (NBDriver) బహిరంగంగా అందుబాటులో ఉండగా, యూజర్-డిఫైన్డ్ సెట్ ఆఫ్ మ్యూటేషన్స్ ప్రెడిక్షన్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కొత్త మ్యుటేషన్ చుట్టూ ఉన్న డీఏన్‌ఏ, దాని క్లాస్ – డ్రైవర్‌ను అంచనా వేయగలుగుతారు’

– కార్తీక్ రామన్, బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్,

ఐఐటీ మద్రాస్

Advertisement

Next Story