- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఐపీఎల్ జరగకపోతే.. ధోనీని మరిచిపోవాల్సిందే'
టీమిండియాను శాసించిన ధోనీ..
ప్రస్తుతం కెరీర్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. టీంలో చోటు దక్కాలంటే ముందుగా ధోనీ ఐపీఎల్‌లో రాణించాల్సి ఉంటుంది. కాగా, నిన్నమొన్నటి వరకు ధోనీ సామర్థ్యాన్ని పొగిడిన సీనియర్లే ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికిపైగా క్రికెట్ ఆడని వ్యక్తిని జట్టులోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పలువురు సీనియర్ క్రికెటర్లు ధోనీలో ఇంకా ఆడే సత్తా ఉందని.. ఐపీఎల్ కాకున్నా అతడి ఫిట్‌నెస్‌ను పరిగణలోకి తీసుకునైనా జట్టులోకి తిరిగి తీసుకోవాలనే అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. కానీ, ప్రస్తుతం ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ కూడా చెబుతున్నాడు. ‘ధోనీ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని, ఐపీఎల్ జరగక పోతే ధోనీ తనను తాను నిరూపించుకునే అవకాశం కోల్పోతాడని.. దీంతో టీ20 జట్టులోకి రావాలనుకున్న ధోనీ ఆశలు కలలు గానే మిగులుతాయని’ గంభీర్ అన్నాడు.
గత ప్రపంచకప్ సెమీ ఫైనల్ తర్వాత అసలు క్రికెట్టే ఆడని ధోనీని ఏ ప్రాతిపదికన జట్టులోకి ఎంపిక చేస్తారని గంభీర్ ప్రశ్నిస్తున్నాడు. ధోనీ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేస్తే బాగుంటుందని ఈ ఢిల్లీదిలీ మాజీ ఆటగాడు అభిప్రాయపడ్డాడు. ‘కేఎల్ రాహుల్ కీపింగ్ విషయంలో ధోనీ కన్నా బెటర్ ఆప్షన్ కాకున్నా.. మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగల ఆటగాడు రాహుల్ ఒక్కడేనని’ అన్నాడు. ఐపీఎల్ జరగకపోతే ధోనీ జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాగా, రిటైర్మెంట్ అనేది ఆయన సొంత విషయం అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఐపీఎల్ వాయిదా పడితే ధోనీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనన్నాడు. ఐపీఎల్ ద్వారా మాత్రమే అతనికి జట్టులో స్థానం దొరికే అవకాశం ఉందన్నాడు. క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ధోనీ పునరాగమనంపై మాట్లాడుతూ.. అతడిని జట్టు నుంచి తీసేయలేదని.. ధోనీనే కొన్ని రోజులు క్రికెట్ ఆడవద్దని నిర్ణయించుకున్నాడని అన్నాడు. టీ20 ఆడాలని గంగూలీ, కోహ్లీ, రవిశాస్త్రిలు నిర్ణయించుకొని ధోనీకి ఫోన్ చేస్తే తప్పకుండా అతడు పునరాగమనం చేస్తాడని చోప్రా అన్నాడు. ధోనీ తనకు ఒక ఫేర్‌వెల్ మ్యాచ్ ఉండాలని కోరుకునే మనస్తత్వం ఉన్న వాడు కాదని.. అతడు ఆటనుంచి కూడా చాలా కూల్‌గా నిష్క్రమిస్తాడని చోప్రా అభిప్రాయపడ్డాడు.
Tags: MS Dhoni, Gautam Gambhir, IPL, Kohli, Ganguly, Srikanth, T20