- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GHMC అలా చేసుంటే.. సాయిధరమ్‌కు ప్రమాదం తప్పేదా..?
దిశ, డైనమిక్ బ్యూరో : సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడిపోయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అతివేగంగా డ్రైవింగ్ చేయడమే కారణం అంటుంటే.. ఆయన అభిమానులు, నెటిజన్లు మాత్రం ఆయన అంత వేగంగా నడపలేదని అది వీడియోలోనే కనిపిస్తోందంటూ నెట్టింట చర్చ జరుపుతున్నారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా.. మారింది. ఆ ట్వీట్ కి ఎంతో మంది స్పందిస్తూ సంబంధిత అధికారులపై విమర్శలు కురిపిస్తున్నారు. ఆ నెటిజన్ చేసిన ట్వీట్ ప్రకారం ” There is a lot of sand particles on the forum mall fly over bridge. Could you please assist someone to can clean it up – @zckukatpally @Director_EVDM ” అని వారం రోజులు క్రితం పోస్ట్ చేశారు. అంతేకాకుండా తాజాగా.. తేజ్‌కి ప్రమాదం జరిగిన ట్వీట్ ని షేర్ చేస్తూ ” Last week eh tweet vesanu flyover meeda sand undi ra ayya ani @GHMCOnline vinte ga” అంటే.. నేను వారం రోజుల క్రితమే ఫ్లైఓవల్ వద్ద ఇసుక ఉంది.
ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తొలగించండి అంటూ జీహెచ్ఎంసీ అధికారులకు ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై జీహెచ్ఎంసీ అధికారులు ముందే స్పందించి ఉంటే ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉండకపోతుండే కదా అని అభిప్రాయపడుతున్నారు. పోలీసులు విడుదల చేసిన సీసీ ఫుటేజీ ప్రకారం ఆయన అతి వేగంగా లేడని, రోడ్డు పై ఇసుక ఉండటం వల్లే బైక్ స్కిడ్ అయిందని తెలుస్తోందంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Last week eh tweet vesanu flyover meeda sand undi ra ayya ani @GHMCOnline vinte ga 😵💫😵💫@SrinivasBellam @vinay_vangala https://t.co/FmQFY21i8Q
— కే.పీ.హెచ్.బీ కుర్రాడు (@KPHB_Kurradu) September 10, 2021
There is a lot of sand particles on the forum mall fly over bridge. Could you please assist someone to can clean it up – @zckukatpally @Director_EVDM @CrmpKpz @GHMCOnline @vinay_vangala @SrinivasBellam
— కే.పీ.హెచ్.బీ కుర్రాడు (@KPHB_Kurradu) September 4, 2021