ఆ బ్యాంకు సీఈవో వేతనంలో 30 శాతం కోత!

by Harish |
ఆ బ్యాంకు సీఈవో వేతనంలో 30 శాతం కోత!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ముంబై కేంద్రంగా పనిచేసే ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సీఈవో వైద్యనాథన్‌తో సహా బ్యాంకులోని సీనియర్ మేనెజ్‌మెంట్ వేతనాల్లో కోతలకు స్వచ్ఛందంగా ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సీనియర్ మేనేజ్‌మెంట్ తమ వేతనంలో 10 శాతం కోతను, సీఈవో వేతనంలో 30 శాతం వదులుకోవడానికి ముందుకు వచ్చినట్టు బ్యాంకు వెల్లడించింది. ఉద్యోగుల ఒక రోజు వేతనాల మొత్తం రూ. 3.29 కోట్లను, బ్యాంకు రూ. 5 కోట్లను పీఎమ్ కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. అలాగే, సీఈవో వైద్యనాథన్ వ్యక్తిగతంగా రూ. 47 లక్షలను కొవిడ్-19 సహాయ కార్యక్రమాల కోసం అందించినట్టు, అందులో రూ. 25 లక్షలను పీఎమ్ కేర్స్ ఫండ్‌కు, రూ. 5 లక్షలను మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి ఇచ్చినట్టు బ్యాంకు పేర్కొంది. ఇక, మరో ప్రైవేట్ రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా సైతం వేతనాల్లో 10 శాతం కోత విధించాలని నిర్ణయించింది. అలాగే, పీఎం కేర్స్ ఫండ్‌కు రూ. 25 కోట్లను విరాళంగా ఇవ్వగా, కోటక్ బ్యాంకు ఎండీ ఉదయ్ కోటక్ మరో రూ. 25 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళమిచ్చారు.

Advertisement

Next Story